Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 6.78 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్.. రేపే విడుదల..!

వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ రేపు (సెప్టెంబర్ 12) భారత్‌లో విడుదల కానుంది. వివో T3 అల్ట్రా పేరుతో (Vivo T3 Ultra 5G Smartphone) లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను సంస్థ వెల్లడించింది. తాజాగా మరికొన్ని వివరాలు విడుదల చేసింది. ఇప్పటికే వివో T3 సిరీస్‌లో వివో T3 5G, వివో T3 లైట్‌ 5G, వివో T3x 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ వివో ఇండియా ఇ-స్టోర్, ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వివో ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ సహా ఇతర ముఖ్యమైన వివరాలు గతంలోనే వె‌ల్లడించింది. తాజాగా ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ కెమెరా, డిస్‌ప్లే వివరాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వివో T3 అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 12 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల సమయంలో సేల్‌ తేదీని కూడా వివో సంస్థ ప్రకటన చేయనుంది.

Vivo T3 Ultra 5G Smartphone to launch tomorrow

తాజాగా వివో విడుదల చేసిన వివరాల ఆధారంగా ఈ అల్ట్రా మోడల్‌ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, HDR10+ సపోర్టు, 10 బిట్‌ కలర్‌ డెప్త్‌ను కూడా కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాతో విడుదల కానుంది. ఈ కెమెరాలతో 60fps వద్ద 4k నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు Aura లైట్‌ రింగ్‌ LED ప్లాష్‌ తో అందుబాటులోకి రానుంది.

గతంలో విడుదలైన వివరాల ఆధారంగా వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 12GB ర్యామ్‌ + 12GB వర్చువల్‌ ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

దీంతోపాటు ఈ వివో అల్ట్రా మోడల్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా సమాచారం. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ లూనార్‌ గ్రే, ఫ్రాస్ట్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. మరియు 7.58 mm అంగుళాల థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

అయితే గతంలో ఈ హ్యాండ్‌సెట్‌ ధరలు వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో ఈ వివో T3 అల్ట్రా మోడల్‌ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ OS వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్ జరనుంది.

Best Mobiles in India

English summary
Vivo T3 Ultra 5G Smartphone to launch tomorrow here are the confirmed specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X