Home
Mobile

6.78 అంగుళాల 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరాతో Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..పూర్తి వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల అయింది. T3 సిరీస్‌ అల్ట్రా మోడల్‌ వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T3 Ultra 5G Smartphone Launched) ఇవాళ భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌లో అందుబాటులోకి వచ్చింది. మరియు కర్వడ్‌ డిస్‌ప్లే సహా IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది.

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లు ;
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k (2800*1260) 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంది.

Vivo T3 Ultra 5G Smartphone

80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ వివో (Vivo Latest Smartphone) అల్ట్రా మోడల్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్‌ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు Aura రింగ్‌ లైట్‌ ను కూడా కలిగి ఉంటుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. AI ఎరేజర్‌, AI Photo Enhance ఫీచర్లుతో లాంచ్‌ అయింది. ఫలితంగా నేరుగా ఫోన్ నుంచే ఫోటోలను ఎడిట్‌ చేయడంతోపాటు మెరుగుపరిచేందుకు అనుకూలంగా ఉంటుంది.

వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఈ అల్ట్రా మోడల్‌ లూనార్‌ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

Vivo T3 Ultra 5G Smartphone

ఈ వివో హ్యాండ్‌సెట్ సేల్‌ సెప్టెంబర్‌ 19 సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.3000 వరకు ఎక్సేంజీ బోనస్‌ను పొందవచ్చు. దీంతోపాటు నోకాస్ట్ EMI ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X