Home
Mobile

6.78 అంగుళాల 3D కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ 5G ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌..!

ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ బచత్‌ డేస్‌ సేల్‌ (Filpkart Big Bachat Days Sale) నడుస్తోంది. ఏప్రిల్‌ 1 న ఈ సేల్‌ ప్రారంభం అయింది. 6 వ తేదీ వరకు సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో భాగంగా వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T3 Ultra 5G) ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే ఈ ఫోన్‌ ధరను సంస్థ రూ.2000 తగ్గించింది. తాజాగా ఈ సేల్‌లో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

రూ.3000 డిస్కౌంట్‌ :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.31,999 గా ఉంది. ఇటీవల ఈ ఫోన్ ధర రూ.2000 తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.26999 గా ఉంది.

Vivo T3 Ultra 5G Smartphone

కలర్‌ వేరియంట్స్ :
ఇతర వేరియంట్‌లపై కూడా ఇదే ఆఫర్‌ వర్తిస్తుంది. ఫలితంగా వాటిని రూ.29,999, రూ.30,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. లూనార్ గ్రే, ఫ్రాస్ట్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5k 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 480Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది.

చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ వివరాలు :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం G715 GPU ను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14 తో పనిచేస్తుంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది.

కెమెరా వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS సపోర్టుతో 50MP సోని IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు Aura Ring Light కూడా అమర్చారు.

ఈ కెమెరా విభాగంగా AI Photo Enhance, AI Eraser వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Best Mobiles in India

English summary
Vivo T3 Ultra 5G Smartphone with 5500mAh battery and 50MP Camera gets rs3000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X