Home
Mobile

వివో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల వివరాలు లీక్‌... 50MP సోనీ కెమెరా, 5500mAh బ్యాటరీ సహా..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి గత వారం వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. సెప్టెంబర్‌ తొలివారంలో ఈ హ్యాండ్‌సెట్ సేల్ ప్రారంభం కానుంది. త్వరలో వివో నుంచి మరో హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఈ కొత్త ఫోన్‌ అనేక సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లలో కనిపించింది. వివో T3 అల్ట్రా (Vivo T3 Ultra Smartphone) పేరుతో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై వివో ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి.

91మొబైల్స్‌ నివేదిక ప్రకారం వివో T3 ప్రో అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు OIS ఫీచర్‌తో కూడిన కెమెరాలతో అందుబాటులోకి రానుంది. టిప్‌స్టర్‌ల వివరాలు ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.30999 గా ఉంటుంది.

Vivo T3 Ultra Smartphone

వివో T3 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లీకైన వివరాల ఆధారంగా వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 1.5K 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో సోనీ IMX921 కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ వివో కొత్త ఫోన్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా రానుంది. మరో టిప్‌స్టర్‌ సంజు చౌధరి ఈ వివో హ్యాండ్‌సెట్‌ 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పారు. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ స్పీకర్‌లతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.

టిప్‌స్టర్‌ సంజు వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 6.77 అంగుళాల డిస్‌ప్లే, 50MP (OIS) + 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలు సహా సెల్ఫీ, వీడియో కాల్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో రానుందని తెలిపారు.

టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ వివరాలు ఆధారంగా వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉంటుంది.

దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని అభిషేక్‌ యాదవ్ అంచనా వేశారు. ఈ హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్‌లో లభిస్తుందని తెలిపారు. లునార్‌ గ్రే, ప్రాస్ట్‌ గ్రీన్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది.

* భారత్‌ మార్కెట్‌లో ఆగస్టు 27న వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Adreno 720 HPU, 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది.

వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. సెప్టెంబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T3 Ultra Smartphone expected to launch in september specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X