50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే ..!
వివో తన T సిరీస్‌ను క్రమంగా విస్తరిస్తోంది. త్వరలో వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T3 Ultra Smartphone) విడుదల చేయనుంది. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక లీక్‌లు వచ్చాయి. తాజాగా వివో అధికారిక వెబ్‌సైట్ (Vivo.Com) సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ వివరాలు వెల్లడయ్యాయి. డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్ సహా ఇతర ముఖ్యమైన వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో T3 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు :
వివో వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ వివరాల ఆధారంగా (Vivo Upcoming Smartphone) వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 2800*1260 పిక్సల్ రిజల్యూషన్ తో 6.78 అంగుళాల కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల కానుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సామర్థ్యంతో 50MP సోనీ IMX921 కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది.
80W ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీ :
ఈ వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 12GB ర్యామ్ + 12GB వర్చువల్ ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ OS వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
IP68 రేటింగ్ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా రానుంది. ఈ హ్యాండ్‌సెట్ సన్నని డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. మరియు 7.58 mm అంగుళాల థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ వివో అల్ట్రా మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
స్టోరేజీ, ధర వివరాలు లీక్ :
టిప్‌సెట్ అభిషేక్ యాదవ్ ఆధారంగా వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు మూడు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది.
128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999, అదే 12GB ర్యామ్+256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999 గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. అయితే కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








