6.72 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ Vivo స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. పూర్తి వివరాలు..!
వివో నుంచి భారత్‌లో మార్కెట్‌లోకి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు వివో అధికారిక ప్రకటన చేసింది. వివో T3X 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T3X 5G smartphone) ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.
వృత్తాకార కెమెరా మాడ్యూల్ :
ఈ టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, కలర్ వేరియంట్లు వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్ గ్రీన్, రెడ్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. రెండు కెమెరాలు సహా LED ప్లాష్ యూనిట్‌ను కలిగి ఉంది. కుడి వైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్లను గుర్తించవచ్చు.

రూ.15000 కంటే తక్కువ ధరకే.. :
ఈ వివో T3X 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17న విడుదల కానుండగా.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఏప్రిల్ 12న ఈ ఫోన్ కొన్ని వివరాలు విడుదల కానున్నాయి. అదే బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు ఏప్రిల్ 15న వెల్లడించనున్నారు. ఈ ప్లిప్‌కార్ట్ లైవ్ పేజీ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.15000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే..! :
ఈ వివో కొత్త స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ స్నాప్ డ్రాన్ 6 జెన్ 1 SoC చిప్‌సెట్ కలిగి ఉండే అవకాశం ఉంది. 4GB, 6GB మరియు 8GB ర్యామ్, 128GB గరిష్ఠ స్టోరేజీ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
6000mAh బ్యాటరీ!
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ వివో T3X 5G స్మార్ట్ ఫోన్ మెరుగైన భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాస్ రెసిస్టెంట్‌తో లాంచ్ కానుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ 7.99mm థిక్‌నెస్‌తో 199 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications