Home
Mobile

6000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 6.72 అంగుళాల పుల్‌ HD డిస్‌ప్లే 5G ఫోన్‌పై రూ.2500 డిస్కౌంట్..!

వివో నుంచి భారత్‌ మార్కెట్‌ లో ఏప్రిల్‌ 2024 లో వివో T3x 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ధరను సంస్థ తగ్గించింది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ మరో సూపర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ను (Vivo T3x 5G Smartphone Price cut) ప్రకటన చేసింది. ఫలితంగా భారీగా తగ్గింపు ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

వివో T3C 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499 గా ఉండేది. మరియు 6GB ర్యామ్‌ ధర రూ.14,999, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.16,499 గా ఉండేది.

Vivo T3x 5G smartphone price drop in india

అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1,000 చొప్పున తగ్గిస్తూ వివో నిర్ణయం తీసుకుంది. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.12,499 గా మారింది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), వివో ఇండియా స్టోర్‌ (Vivo India Store), ఇతర రిటైల్ స్టోర్‌లలో అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్‌ కార్డులపై రూ.1500 అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే మొత్తంగా ధర రూ.2500 తగ్గింపుతో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

వివో T3x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల FHD LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1080*2408 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. మరియు 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ క్రిమ్షన్‌ బ్లిస్‌, సఫైర్‌ బ్లూ, సెలస్టియల్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ :
ఈ ఫోన్‌ ర్యామ్‌ అదనంగా 8GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. మరియు మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB స్టోరేజీ వరకు పొడిగించుకోవచ్చు. భద్రత కోసం ఈ వివో 5G స్మార్ట్‌ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫ్రింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ను అమర్చారు. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

50MP ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T3x 5G smartphone price slashed by rs2500 including bank discount in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X