7300mAh బ్యాటరీ, 50MP కెమెరా, 90W ఛార్జింగ్‌తో Vivo T4 5G.. ధర ఎంతంటే?
Vivo T4 5G : Vivo నుంచి కొత్త ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 22న వివో T4 5G మొబైల్ (Vivo T4 5G)ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో రానుందని తెలిసి మొబైల్ ప్రియులు ఉత్సాహపడుతున్నారు. ఈ మొబైల్ టీజర్స్ దీనిపై అంచనాలను భారీగా పెంచేశాయి. మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ అయింది. వివో T-సిరీస్ ఫోన్లు మంచి పనితీరుకు పెట్టింది పేరు.
ఇప్పుడు T4 5G, ముఖ్యంగా దాని భారీ బ్యాటరీ, కొత్త చిప్‌సెట్‌తో ఈ సిరీస్ స్థాయిని మరింత పెంచేలా కనిపిస్తోంది. కంపెనీ ఇప్పటికే విడుదల తేదీని ధృవీకరించి, ఫోన్ డిజైన్‌కు సంబంధించిన కొన్ని అంశాలను టీజ్ చేయడంతో, టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

* డిజైన్, డిస్‌ప్లే ఎలా ఉండబోతున్నాయి..
వివో T4 5G చూడటానికి చాలా ప్రీమియంగా, నాలుగు వైపులా వంగిన (Quad-curved) అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఇది బహుశా 6.67 అంగుళాల స్క్రీన్ అయి ఉండొచ్చు. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇంకా కళ్లు చెదిరేలా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండొచ్చని అంచనా.
ఫోన్ అంచులు (Bezels) చాలా పలుచగా కనిపిస్తున్నాయి, ముందు కెమెరా కోసం స్క్రీన్ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ ఉంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫోన్‌కు కుడి వైపున ఉన్నాయి. అదనపు సౌలభ్యం కోసం డిస్‌ప్లేలోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టీవీ లాంటివి కంట్రోల్ చేయడానికి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉండొచ్చు.
* స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్
పనితీరు విషయానికొస్తే, వివో T4 5Gలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది మిడ్-రేంజ్ ఫోన్లలో మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్. గేమింగ్, మల్టీమీడియా వంటివి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ఆస్వాదించడానికి అడ్రినో 720 జీపీయూ కూడా జత చేశారు.
స్టోరేజ్ విషయానికొస్తే, 8GB లేదా 12GB LPDDR4X ర్యామ్, 128GB లేదా 256GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు ఉండవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Vivo కస్టమ్ Funtouch OS 15 తో పనిచేస్తుందని భావిస్తున్నారు. మరో ఐదు ఆరు రోజుల్లో ఈ వివరాలపై పూర్తి స్పష్టత వస్తుంది.
* బ్యాటరీ ఏకంగా 7,300mAh
వివో T4 5Gలో అందరినీ ఎక్కువగా ఆకట్టుకునే అంశం దాని భారీ బ్యాటరీ. ఏకంగా 7,300mAh సామర్థ్యంతో వస్తోంది. బహుశా భారత స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాటరీ కావచ్చు. ఈ భారీ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, బ్యాటరీ లైఫ్ గురించి దిగులు ఉండదు.
* కెమెరా విశేషాలు
ఫోటోగ్రఫీ కోసం, T4 5G వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా, పోర్ట్రెయిట్ షాట్స్ కోసం 2MP డెప్త్ సెన్సార్ ఉండవచ్చు. ముందు వైపు 32MP కెమెరా ఉంటుందని అంచనా.
* రంగులు, లభ్యత
Vivo ఈ ఫోన్‌ను రెండు రంగులలో టీజ్ చేసింది. ఎమరాల్డ్ బ్లేజ్ (ఆకుపచ్చ), ఫాంటమ్ గ్రే (బూడిద రంగు). చూడటానికి ఆకర్షణీయంగా, అదే సమయంలో హుందాగా కనిపించాలనుకునే వారిని ఈ రంగులు ఆకట్టుకుంటాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఇంకా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
* అంచనా ధర, వేరియంట్లు
వివో T4 5G మూడు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB. దీని ధర సుమారు రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఇది అందుబాటు ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించే విభాగంలోకి వస్తుంది. దాదాపు ఇలాంటి స్పెసిఫికేషన్లతో వచ్చిన ఐకూ Z10 ధర కూడా ఇదే రేంజ్‌లో ఉన్నందున, ఈ ధరల అంచనా నిజమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications