Vivo T4 5G ఫోన్ వచ్చేస్తోంది.. దాని డిజైన్, కలర్ ఆప్షన్స్ చూస్తే ఫిదా.. ఫీచర్లు, ధర వివరాలివే..
Vivo T4 5G: వివో కంపెనీ ఇండియాలో మరో కొత్త 5G ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. వివో T4 5G పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన చిన్న చిన్న టీజర్లు మొదలయ్యాయి. వాటిని బట్టి చూస్తే, ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ఎక్కువసేపు నిలిచే బ్యాటరీ ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ ఏప్రిల్ చివరికల్లా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లేదా వివో (Vivo) ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉండబోతోంది, ఏయే రంగుల్లో లభిస్తుంది, ముఖ్యమైన ఫీచర్లు ఏంటనే విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం పదండి.

* చూడగానే వావ్ అనిపించే డిజైన్, అదిరిపోయే రంగులు..
వివో T4 5G డిజైన్ చాలా స్టైలిష్‌గా, పెద్ద పెద్ద ఖరీదైన ఫోన్ల (Flagship) లాగా కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో గుండ్రంగా, పెద్దగా ఉండే కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందులోనే ప్రధాన కెమెరాలు, వాటి చుట్టూ మెరిసే ఒక రింగ్ (Glowing ring) కూడా ఉంటాయి.
ఫోన్ అంచులు గుండ్రంగా ఉండటంతో చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్ ఫోన్‌కి కుడి వైపున ఉంటాయి. రంగుల విషయానికొస్తే, రెండు భిన్నమైన, ఆకట్టుకునే రంగుల్లో ఇది లభిస్తుంది. అవి తాజాగానే లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ కలర్ ఆప్షన్స్ అనేవి చాలా మంది టెక్ ప్రియులను ఫిదా చేస్తున్నాయి.
మొదటిది ఎమరాల్డ్ బ్లేజ్ (Emerald Blaze). ఈ రంగులో కెమెరా చుట్టూ బంగారు రంగు పూత (Gold accents) ఉండటం వల్ల మరింత ప్రీమియం లుక్ వస్తుంది. రెండోది ఫాంటమ్ గ్రే (Phantom Grey) ఇది కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
* ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల పెద్ద Full HD+ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో రావడం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. క్వాలిటీ సినిమాలు కూడా ల్యాగ్ లేకుండా చూడొచ్చు. గేమ్స్ బాగా ఆడుకోవచ్చు. అంతేకాదు, దీనికి క్వాడ్-కర్వ్డ్ డిజైన్ (నాలుగు వైపులా వంగినట్లు) ఉంటుందని అంచనా.
ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 (Qualcomm Snapdragon 7s Gen 3) ప్రాసెసర్‌ను వాడుతున్నారు. కాగా Vivo T3లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉండేది, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15 (Funtouch OS 15)తో రావచ్చు.
అలాగే మూడు మెమొరీ ఆప్షన్లు ఉండొచ్చు. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB + 256GB, 12GB + 256GB. ఈ ఫోన్‌లో అతి పెద్ద హైలైట్ దాని బ్యాటరీ. ఏకంగా 7,300mAh భారీ బ్యాటరీతో వస్తోంది. 'కౌంటర్‌పాయింట్' రీసెర్చ్ సంస్థ ప్రకారం, ఇప్పటివరకు భారతీయ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అట.
* 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
అంతేకాదు, ఛార్జింగ్ కూడా వేగంగా ఎక్కడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వివో T3లో కేవలం 5,000mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ మాత్రమే ఉండేవి, వాటితో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్. ఛార్జింగ్ చాలా వేగంగా అవ్వాలనుకునే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది.
* కెమెరాలు
ఫోన్ విడుదలయ్యాక వచ్చే రివ్యూలలో (Reviews) ఈ మొబైల్ ఛార్జింగ్ వేగం, బ్యాటరీ పనితీరు వంటి పూర్తి వివరాలు తెలుస్తాయి. కెమెరాల విషయానికి వస్తే, వెనుకవైపు 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా (ఇందులో OIS ఫీచర్ ఉంది,) 2MP సెకండరీ కెమెరా ఉంటాయి.
ముందువైపు 32MP కెమెరా ఇస్తున్నారు. ఇది Vivo T3లోని 16MP కెమెరా కన్నా చాలా మెరుగైనది. ఇతర ఫీచర్లు చూస్తే ఈ ఫోన్ 8.1mm మందంతో, 195 గ్రాముల బరువుతో వస్తుందట. భద్రత కోసం స్క్రీన్ లోపలే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే, టీవీ, ఏసీ వంటి వాటిని కంట్రోల్ చేయగల IR బ్లాస్టర్ ఇవ్వనున్నారు.
* ధర ఎంత ఉండొచ్చు, ఎప్పుడు వస్తుంది..
వివో T4 5G ధర సుమారుగా రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ఫీచర్లు చూస్తుంటే, ఇది ఇటీవల చైనాలో విడుదలైన వివో Y300 ప్రో+ ఫోన్‌కి పేరు మార్చి (Rebranded version) ఇండియాలో విడుదల చేస్తున్నట్లు అనిపిస్తోంది. వివో త్వరలోనే ఈ ఫోన్ గురించి మరిన్ని ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టనుంది. అధికారికంగా ఏప్రిల్ చివరి వారంలో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.


Click it and Unblock the Notifications








