7300mAh భారీ బ్యాటరీ Viv౦ 5G స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, డిస్‌ప్లే, ధర వివరాలు లీక్..!
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధికంగా ఉన్నారు. ఇటీవల వచ్చిన కొన్ని రిపోర్టుల ఆధారంగా భారత్‌లో రోజుకు సగటున 5 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ను వినియోగించే వారున్నారని ఓ నివేదిక వెల్లడించింది. అంటే ప్రతిరోజు ఎక్కువ గంటలపాటు ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. దీంతో అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు భారీ బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన అనేక ఫోన్ చాలా వరకు 6000mAh బ్యాటరీలను కలిగి ఉంటున్నాయి.
అయితే ఐకూ, వివో వంటి సంస్థలు ఏకంగా 7300mAh బ్యాటరీలతో ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. ఐకూ Z10 ఈ వారంలోనే లాంచ్ కానుంది. వివో T4 5G ఫోన్ (Vivo T4 5G Smartphone) కూడా 7300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే వివో T4x 5G ఫోన్ అందుబాటులో ఉంది.

కీలక వివరాలు లీక్ :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. భారీ బ్యాటరీ సహా క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ డిస్‌ప్లే సహా కెమెరా మాడ్యూల్, చిప్‌సెట్ సహా మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి.
చిప్‌సెట్! :
ఈ వివో భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మరియు ఈ ఫోన్ ఫాంటమ్ గ్రే, ఎమరాల్డ్ బ్లేజ్ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని భావిస్తున్నారు.
ఈ ఫోన్ సర్కులర్ కెమెరా ఐలాండ్ ఫీచర్‌తో వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చి ఉంటుందని భావిస్తున్నారు. ఎమరాల్డ్ గ్రీన్ వేరియంట్ కెమెరా మాడ్యూ్ల్ చుట్టూ బంగారు రంగు డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే బ్యాటరీ వివరాలను వివో వెల్లడించింది. 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫలితంగా హెవీ యూజర్‌లు కూడా సుమారు రెండు రోజులపాటు వినియోగించుకోవచ్చు. భారీ బ్యాటరీతోపాటు ప్రత్యేక డిజైన్‌తో మిడ్ రేంజ్ యూజర్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. IR బ్లాస్టర్‌తోపాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ. 12GB స్టోరేజీ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఈ నెల చివరిలోగా విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వివో T4x 5G ఫోన్ :
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ +128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది.
ఈ ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు డైనమిక్ లైట్ రింగ్‌ను అమర్చారు. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








