Home
Mobile

7300mAh భారీ బ్యాటరీతో మరో 5G ఫోన్‌ లాంచ్‌ కానుంది.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, విడుదల తేదీ వివరాలు..?

స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ భారత్‌ యూజర్‌లను ఆకట్టుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, నాణ్యమైన కెమెరాలు, ఆకట్టుకొనే డిజైన్‌, భారీ బ్యాటరీలు, వాటర్‌ ప్రూఫ్‌ తో ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. అయితే ఇటీవల లాంచ్‌ అయిన కొన్ని ఫోన్‌లు ఏకంగా 6.88 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరికొన్ని 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే ఐకూ కీలక ప్రకటన :
అయితే తాజాగా భారీ బ్యాటరీలతో యూజర్‌లను ఆకట్టుకొనేందుకు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐకూ నుంచి ఇటీవల కీలక ప్రకటన వచ్చింది. ఐకూ Z10 5G స్మార్ట్‌ఫోన్‌ను ఏకంగా 7300mAh బ్యాటరీతో లాంచ్‌ చేస్తామని ప్రకటన చేసింది. ఈ ఫోన్‌ ఏప్రిల్ 11 న భారత్‌లో లాంచ్‌ కానుంది.

Vivo T4 5G Smartphone Expected to launch with 7300mAh large battery in april in india

అయితే వివో కూడా భారీ బ్యాటరీతో ఓ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివో T సిరీస్‌ స్మార్ట్‌ఫోన్.. వివో T4x 5G ఈ నెలలో (Vivo T4 5G Smartphone) విడుదల అయింది. అయితే త్వరలో వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ 91మొబైల్స్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.

7300mAh భారీ బ్యాటరీ :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ నెలలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిస్‌ప్లే, చిప్‌సెట్‌, కెమెరా, ధర అంచనా వివరాలు లీక్‌ అయ్యాయి.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీప్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫలితంగా విజువల్‌గా మెరుగైన అనుభూతిని పొందుతారని తెలుస్తోంది.

ఈ భారీ బ్యాటరీ వివో స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఫలితంగా గత వేరియంట్‌ కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ సెగ్మెంట్‌లో గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం మంచి ఆప్షన్‌గా ఉండనుందని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుందని సమాచారం. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. అయితే ఎన్ని సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

కెమెరా పరంగానూ మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉండనుంది. ఈ వివో T4 5G స్మా్ర్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP సోనీ IMX882 ప్రీమరీ కెమెరాతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాతో లాంచ్‌ కానుందని సమాచారం.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ ధర పై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఫోన్‌ ప్రారంభ ధర రూ.20,000 నుంచి రూ.30000 మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో లాంచ్‌ అయిన వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. ఈ ఫోన్‌ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు IR బ్లాస్టర్‌ ఫీచర్‌లు ఉండే అవకాశం ఉంది.

FAQs
వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు లాంచ్ కానుంది?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఏప్రిల్‌ నెలలో లాంచ్ కానుంది. కచ్చితమైన తేదీ తెలియాల్సి ఉంది.

భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల ఛార్జింగ్ సమయం ఎలా ఉండనుంది?

7300mAh వంటి బ్యాటరీ కలిగిన ఫోన్‌లను ఛార్జింగ్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే 120W, 100W, 90W వంటి ఛార్జింగ్‌ సపోర్టుతో వేగంగా ఛార్జింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

వివో నుంచి ఇటీవల వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు ఏంటి?

వివో V50, వివో T4x 5G ఫోన్‌లు ఇటీవల లాంచ్ అయ్యాయి. T4x 5G మోడల్‌ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 5G Smartphone Expected to launch with 7300mAh large battery in april in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X