7300mAh భారీ బ్యాటరీ వివో 5G స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు వెల్లడి.. ఈ ఫీచర్ కచ్చితంగా మీకు నచ్చుతుంది..!
వివో నుంచి భారీ బ్యాటరీతో ఏప్రిల్ 22 వ తేదీన భారత్ మార్కెట్లో వివో T4 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4 5G Smartphone) విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలో లాంచ్ కాగా.. మిడ్ రేంజ్‌లో T4 5G ఫోన్ లాంచ్ కానుంది. అయితే తాజాగా బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను వివో అధికారికంగా వెల్లడించింది. ఈ ఫీచర్లు కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
భారీ బ్యాటరీ :
వివో వెల్లడించిన వివరాల ఆధారంగా వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 7300mAh భారీ బ్యాటరీతో విడుదల కానుంది. ఈ ఫోన్ బ్లూవాల్ట్ బ్యాటరీ ఆనోడ్ మెటీరియల్స్ మరియు థర్డ్ జనరేషన్ సిలికాన్‌ను ఉపయోగించారు. ఫలితంగా గత మోడల్ కంటే 15.7 ఎనర్జీ డెన్సిటీని మెరుగుపరుస్తుందని తెలిపింది.

రివర్స్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టు :
బ్యాటరీ హెల్త్ కోసం వివో నానో కేజ్ స్టక్చర్ టెక్నాలజీ, ఎలక్ట్రోడ్ రీషేపింగ్, కార్బన్ నానోట్యూబ్ కండక్షన్ ను ఉపయోగించారు. భారీ బ్యాటరీతోపాటు ఈ ఫోన్ మరో సూపర్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతోపాటు రివర్స్, బైపాస్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.
బైపాస్ ఛార్జింగ్ :
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ఆధారంగా ఈ బైపాస్ ఛార్జింగ్ వివరాలు వెల్లడయ్యాయి. బైపాస్ ఛార్జింగ్ అంటే.. ఫోన్ బ్యాటరీ నుంచి ఛార్జింగ్‌ను ఉపయోగించుకొనే బదులుగా.. ఛార్జర్ నుంచే పవర్‌ను ఉపయోగించుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ను కూడా ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది.
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ అంచనా వివరాలు :
ఈ భారీ బ్యాటరీ వివో హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంటుందని సమాచారం. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ఎమరాల్డ్ బ్లేజ్ ఎడిషన్, ఫాంటమ్ గ్రే రంగుల్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఎమరాల్డ్ బ్లేజ్ ఎడిషన్ 7.89mm థిక్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IR బ్లాస్టర్‌ను కలిగి ఉంది.
50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ :
ప్రస్తుతం లీక్ అయిన వివరాల ఆధారంగా వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ రూ.20 వేల నుంచి రూ.25 వేల మధ్య విడుదల కానుందని తెలుస్తోంది.
వివో T4x 5G ఫోన్ ఫీచర్‌లు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో T4x 5G ఫోన్ బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.16999 గా ఉంది.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS (Skin) ను కలిగి ఉంది.
బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ ఫోన్ :
ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫలితంగా బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ ఫోన్‌గా గుర్తింపు పొందింది.
అయితే బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చిన మెరుగైన కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు డైనమిక్ రింగ్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు.


Click it and Unblock the Notifications








