Home
Mobile

7300mAh భారీ బ్యాటరీ, 6.77 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే, 50MP కెమెరాతో Vivo 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

భారత్‌ మార్కెట్‌లో భారీ బ్యాటరీ ఫోన్‌ల లాంచ్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ నెల రెండో వారంలో 7300mAh బ్యాటరీతో ఐకూ Z10 ఫోన్‌ లాంచ్ అయింది. ఏప్రిల్‌ 21 వ తేదీన 7000mAh బ్యాటరీతో ఒప్పో K13 5G ఫోన్‌ విడుదల అయింది. ఇవాళ 7300mAh బ్యాటరీతో వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4 5G Smartphone launched) అందుబాటులోకి వచ్చింది. భారీ బ్యాటరీతోపాటు ఈ ఫోన్‌ అనేక బెస్ట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ సంవత్సరం మార్చి నెలలో వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అయింది.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ (1080*2392 పిక్సల్స్‌) అమోలెడ్ క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెట్‌ హ్యాండ్‌ టచ్ ను కలిగి ఉంటుంది. అంటే తడి చేతులతోనూ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. మరియు ఐ ప్రొటెక్షన్‌ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.

Vivo T4 5G Smartphone launch telugu news

చిప్‌సెట్‌ :
ఈ ఫోన్‌ 4nm ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీ ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది.

రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ AI Erase, AI Photo Enhance, Live Text, AI Note Assistant, సూపర్‌ డాక్యుమెంట్‌, సర్కిల్ టూ సెర్చ్‌ వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి.

Vivo T4 5G Smartphone launch telugu news

50MP + 32MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ వివో హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ముందువైపు f/2.0 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ అయింది. 90W వైర్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ మరియు రివర్స్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. 33 నిమిషాల్లో 50 శాతం, 65 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.

ఈ ఫోన్‌ బైపాస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. గేమింగ్‌, ఇతర హెవీ టాస్క్‌ల సమయాల్లో పవర్‌ సప్లై నేరుగా ఫోన్ మదర్‌బోర్డుకు వెళ్తుంది. ఫలితంగా ఫోన్‌ వేడెక్కకుండా ఉంటుంది. మరియు ఎక్కువ కాలం పాటు బ్యాటరీ మెరుగైన పనితీరు కనబరుస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, OTG, IR బ్లాస్టర్‌ ను సపోర్టు చేస్తుంది. మరియు IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఈ వివో హ్యాండ్‌సెట్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

వివో T4 5G స్మా్ర్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. ఈ ఫోన్‌ ఎమరాల్డ్‌ బ్లేజ్‌, ఫాంటమ్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్‌ వివో ఇండియా స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్‌ 29 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రూ.2000 ఎక్చ్సేంజ్‌ బోనస్‌ను కూడా అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 5G Smartphone launched with 7300mAh large battery and 90W charging support in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X