Home
Mobile

7300mAh అతిపెద్ద బ్యాటరీతో వివో 5G స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు..!

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల కోసం పవర్‌ బ్యాంక్‌లు వినియోగించే వారు. అయితే ప్రస్తుతం పవర్‌ బ్యాంక్స్‌ అవసరం లేకుండా ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. అంటే భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తొలిసారిగా ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ 7300mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌ లో లాంచ్‌ చేసింది. రియల్‌మి మరియు వన్‌ప్లస్‌ కూడా 7000mAh కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తాయని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని భారీ బ్యాటరీ ఫోన్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌ 7100mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని లీక్స్‌ వచ్చాయి. దీంతోపాటు రియల్‌మి GT 7, ఒప్పో K13 5G ఫోన్‌ కూడా భారీ బ్యాటరీలతో లాంచ్‌ కానున్నాయి. ఈ జాబితాలో వివో కూడా ఉంది. వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ 7300mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుంది.

Vivo T4 5G smartphone india launch date

వివో ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది :
తాజాగా వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4 5G Smartphone Launch Date) విడుదల తేదీని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌ ఇటీవల విడుదల అయిన ఐకూ Z10 మోడల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్‌లతో కలిపి ఐకూ Z10 ఫోన్‌ ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది. త్వరలో సేల్ ప్రారంభం కానుంది.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ వివో ఇండియా అధికారిక ఇ-స్టోర్‌ మరియు ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. సుమారు రూ.22 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
వివో భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ ఐకూ Z10 మోడల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. దీంతో సుమారుగా ఒకే తరహా ఫీచర్‌లను కలిగి ఉంటాయి. వివో ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

వివో కొత్త హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌, Adreno 810 గ్రాఫిక్స్‌ చిప్‌సెట్‌లను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా. 2MP డెప్త్ సెన్సార్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ డైమండ్‌ షీల్డ్‌ టెంపర్డ్‌ గ్లాస్‌ స్క్రాచ్‌ ప్రూఫ్‌, డ్రాప్‌ ప్రూఫ్‌ గా ఉంది. ఈ ఫోన్‌ 7.89mm థిక్‌నెస్‌తో 199 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గ్రీన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుందని సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 5G smartphone with 7300mAh Battery launch date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X