7300mAh బ్యాటరీ, 6.77 అంగుళాల అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా Vivo 5G ఫోన్ సేల్ రేపటి నుంచే!
వివో నుంచి ఇటీవల T4 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 7300mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ రేపటి నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ మార్కెట్‌లో భారీ బ్యాటరీలతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ 7300mAh బ్యాటరీ, ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీతో విడుదల కానుంది. ఈ రెండు ఫోన్‌ల సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ను రేపు (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
వివో T4 5G స్మా్ర్ట్‌ఫోన్ (Vivo T4 5G Smartphone Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. వివో ఇండియా, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్ట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను SBI, HDFC, Axis బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తుంది.
ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్ టూ సెర్చ్, సూపర్ డాక్యుమెంట్, AI Erase, AI Photo Enhance, ఏఐ నోట్ అసిస్టెంట్, లైవ్ టెక్ట్స్, సూపర్ డాక్యుమెంట్ వంటి అనేక ఫీచర్‌లున్నాయి.

వివో స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్ ద్వారా 33 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్, 65 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని వివో తెలిపింది. ఈ ఫోన్ రివర్స్, బైపాస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.
వివో భారీ బ్యాటరీ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP OIS ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, WiFi, GPS, OTG, IR బ్లాస్టర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే ఫోన్‌ను తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు. ను సపోర్టు చేస్తుంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








