రూ.10 వేల ధర రేంజ్‌లో 6000mAh బ్యాటరీ, 6.74 అంగుళాల డిస్‌ప్లేతో Vivo 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ వెల్లడి!
Vivo T4 Lite 5G Smartphone Launch : వివో T4 సిరీస్‌లో ఇప్పటికే వివో T4, T4x 5G, వివో T4 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ నుంచి త్వరలో భారత్ మార్కెట్లోకి వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి తాజాగా స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలతోపాటు లాంచ్ తేదీ కూడా వెల్లడయ్యింది. ఈ ఫోన్ రూ.10000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ఎప్పుడు విడుదల కానుంది? :
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ జూన్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు వివో వెల్లడించింది. వివో ఇండియా వెబ్‌సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన వెబ్‌పేజీని కూడా క్రియేట్ చేసింది. ఈ ఫోన్ విడుదల అనంతరం ఫోన్‌ను వివో ఇండియా, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

డిస్‌ప్లే వివరాలు :
వివో వెల్లడించిన వివరాల ఆధారంగా లాంచ్ తేదీతోపాటు కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ వివో హ్యాండ్‌సెట్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు TUV Rheinland Low Blue లైట్ సర్టిఫికేషన్‌తో విడుదల కానుంది.
2TB వరకు స్టోరేజీ :
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెడ్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డులతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే స్టోరేజీ వేరియంట్స్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

70 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం :
వివో స్మా్ర్ట్‌ఫోన్ 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 70 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం లేదా 19 గంటల గేమింగ్ టైం లేదా 22 గంటల వీడియో స్ట్రీమింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని వివో చెబుతోంది.
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. వివో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.10 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వివో విడుదల చేసిన అధికారిక పోస్టర్‌ల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
వివో Y400 Pro స్మార్ట్‌ఫోన్ :
వివో నుంచి రేపు (జూన్ 20) మధ్యాహ్నం 12 గంటలకు వివో Y400 Pro స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ రూ.20000 ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది.
వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్ 3D కర్వడ్ డిస్‌ప్లేతో కూడిన స్లిమ్ డిజైన్‌తో లాంచ్ కానుంది. కెమెరా విభాగం పరంగా వృత్తాకాల Aura లైట్‌తో కూడిన డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వివో Y400 ప్రో స్మార్ట్‌ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications