Home
Mobile

రూ.9999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.74 అంగుళాల డిస్‌ప్లేతో Vivo 5G ఫోన్‌..!

Vivo T4 Lite 5G Smartphone Launched : వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. వివో T4 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే వివో T4, వివో T4x 5G, వివో T4 అల్ట్రా విడుదల కాగా.. తాజాగా వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఎంట్రీ లెవల్‌ ధరలో లాంచ్‌ అయినా.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

వివో T4 లైట్‌ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 720 X1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland Low Blue లైట్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది.

Vivo T4 Lite 5G Smartphone features

మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ :
ఈ వివో ఫోన్‌ SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ మరియు MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఫలితంగా ఫోన్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ వివో ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ గరిష్ఠంగా 256GB స్టోరేజీ వేరియంట్‌ను కలిగి ఉంది. అయితే మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

Vivo T4 Lite 5G Smartphone features

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతోపాటు LED ఫ్లాష్‌ యూనిట్‌ను కూడా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంది.

వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.9999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది.

ఈ వివో T4 లైట్‌ 5G ఫోన్‌ సేల్‌ జులై 2 నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI, యాక్సెస్‌ బ్యాంకుల కార్డుల ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ టైటానియం గోల్డ్‌, ప్రీజమ్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Vivo T4 Lite 5G Smartphone launched in india with 6000mAh battery and 50MP camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X