Home
Mobile

మిలిటరీ గ్రేడ్ షాక్‌ రెసిస్టెన్స్‌, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో 5G ఫోన్‌.. ధర రూ.10499!

భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం వివో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో T4 సిరీస్‌, V సిరీస్‌ ఫోన్‌లు ఉన్నాయి. ఈ సంవత్సరం జున్‌లో అందుబాటులోకి వచ్చిన వివో T4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ను (Vivo T4 Lite 5G Smartphone) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌తోపాటు 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రూ.10499 ప్రారంభ ధర :
వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం వివో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.13,499 గా ఉంది.

Vivo T4 lite 5G smartphone now available at Rs10499 starting price on flipkart

రెండు కలర్‌ వేరియంట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వివో బడ్జె్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రిజమ్‌ బ్లూ, టైటానియం గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ :
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. దీంతోపాటు SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ వివో హ్యాండ్‌సెట్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland Low Blue లైట్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. రెండు OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Vivo T4 lite 5G smartphone now available at Rs10499 starting price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X