రూ.9499 కే 50MP కెమెరా, 6.74 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ 5G ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Vivo T4 Lite 5G Smartphone Sale : వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవల భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ రూ.10 వేల ధర రేంజ్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ పూర్తి వివరాలు. ఎంట్రీ లెవల్ ధరలో 5G ఫోన్ కోసం చూసే వారి కోసం ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది.

రూ.500 డిస్కౌంట్ :
అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. HDFC, SBI, Axis బ్యాంకుల కార్డుల ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. టైటానియం గోల్డ్, ప్రీజమ్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
వివో T4 లైట్ 5G ఫోన్ పూర్తి వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ వివో 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland Low Blue లైట్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC :
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








