రూ.15 వేల ధరలో ఫోన్ కోసం చూస్తున్నారా.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో..
వివో నుంచి భారత్ మార్కెట్‌లో రేపు (ఫిబ్రవరి 19) వివో V70 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే గత సంవత్సరం కూడా అనేక మోడల్స్ విడుదల అయ్యాయి. రూ.15 వేల ధరలో 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ హ్యాండ్‌సెట్ ఓ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4 Lite 5G Smartphone) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.

కలర్ వేరియంట్స్ :
అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. వివో ఫోన్ టైటానియం గోల్డ్, ప్రిజం బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు SGS 5 స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. ఫలితంగా ఈ ఫోన్ పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది.
HD+ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని కలగకుండా ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది.
6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ AI Photo Enhance, AI Erase వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టుతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








