Home
Mobile

రూ.9999 కే పొరపాటున కిందపడినా డ్యామేజీ కానీ, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌ లో రూ.10 వేల ధర సెగ్మెంట్‌ లో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వివో T4 సిరీస్‌లో భాగంగా వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను ( Vivo T4 Lite 5G Smartphone ) జూన్‌ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.10 వేల ధరలో ఉన్న బెస్ట్ ఫోన్‌ లలో ఈ హ్యాండ్‌సెట్ ఒకటిగా ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ మరియు ప్రత్యేక ఫీచర్‌ లను కలిగి ఉంది.

రూ.9999 ధరకే స్మార్ట్‌ఫోన్‌ :
వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ లో ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులు, ఫ్లిప్‌కార్ట్ SBI బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ను పొందవచ్చు.

vivo T4 lite 5G smartphone telugu news

మిలిటరీ గ్రేడ్‌ రెసిస్టెన్స్‌, యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్ :
వివో హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌ తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌, MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland Low Blue లైట్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 15 OS, 6000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

vivo T4 lite 5G smartphone telugu news

50MP కెమెరా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ AI Erase, AI Photo Enhance వంటి AI ఫీచర్లను కలిగి ఉంది.

vivo T4 lite 5G smartphone telugu news

IP64 రేటింగ్‌ :
కనెక్టివిటీ పరంగా వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.4, GPS, USB- C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. టైటానియం గోల్డ్‌, ప్రీజమ్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
vivo T4 lite 5G smartphone with anti Fall protection, 6000mAh battery at Rs9999 in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X