Home
Mobile

Vivo నుంచి మరో మంచి కెమెరాల స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా కీలక వివరాలు వెల్లడి.. వచ్చే వారంలోనే విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవలే V60 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. దీంతోపాటు వివో T4 సిరీస్‌లో వివో T4, T4x 5G. T4 లైట్‌ 5G, వివో T4 అల్ట్రా, వివో T4R మోడల్స్‌ లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ విడుదల తేదీ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా కెమెరా వివరాలు విడుదల అయ్యాయి.

వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ (Vivo T4 Pro 5G Smartphone) ఆగస్టు 26 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ఆధారంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో రెండు కెమెరాల స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి.

vivo T4 Pro 5G smartphone

50MP + 50MP కెమెరాలు :
ఈ ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ కెమెరా, 3x జూమ్‌తో 50MP సోనీ పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉంటుంది. మూడో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు Aura లైట్‌ను కూడా కలిగి ఉంటుంది.

6500mAh బ్యాటరీ :
ఇప్పటికే విడుదల అయిన వివరాలు ఆధారంగా వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 7.53mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుంది. దీంతోపాటు 6500mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, AI ఫీచర్లు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. మరియు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రూ.25 వేల నుంచి రూ.30 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వివో V60 స్మార్ట్‌ఫోన్ :
ఇటీవలే వివో నుంచి V60 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా (OIS), 50MP సోనీ IMX882 టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌. 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

వివో V60 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.36999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.40999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.45999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T4 Pro 5G smartphone key specifications, features confirmed ahead of launch on august 26 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X