వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవలే V60 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
అయితే త్వరలో వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఫోన్ విడుదల తేదీ వెల్లడయింది. వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4 Pro 5G Smartphone) ఆగస్టు 26 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది.

అల్ట్రా స్లిమ్ డిజైన్ :
ఈ ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలతో ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లైవ్‌లో ఉంది. ఈ ఫోన్ 7.53mm థిక్‌నెస్‌తో అల్ట్రా స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
వివో T4 ప్రో 5G స్మా్ర్ట్‌ఫోన్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు బ్లేజ్ గోల్డ్, నిట్రో బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు 6500mAh బ్యాటరీతో లాంచ్ కానుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మరియు కెమెరా విభాగం పరంగా మెరుగైన కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP సోనీ IMX882 టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. ఫలితంగా దూరం నుంచి కూడా ఆకట్టుకొనేలా క్యాప్చర్ చేయవచ్చు.
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ సుమారుగా రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ధరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* ఇటీవల విడుదల అయిన వివో V60 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.36999 గా ఉంది. 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ వివో హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా (OIS), 50MP సోనీ IMX882 టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ AI Image Expander, AI Smart Call Assistant, AI స్పామ్ బ్లాక్ టూల్ ను కలిగి ఉంది. మరియు ఆస్పీషియస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








