Home
Mobile

50MP + 50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ, క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో Vivo 5G స్మార్ట్‌ఫోన్‌..!

Vivo T4 Pro 5G Smartphone : వివో నుంచి ఇవాళ T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. మిడ్‌ రేంజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. మరియు అల్ట్రా స్లిమ్ డిజైన్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చంది. ఈ ఫోన్‌ క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ (1080 x 2392 పిక్సల్స్‌) క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 5000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

vivo T4 Pro 5G Smartphone launched

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ ను అమర్చి ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 16,470 sq mm 10 లేయర్‌ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ గూగుల్ జెమిని యాప్‌, జెమిని లైవ్‌ ఉన్నాయి. ఈ ఫోన్ AI క్యాప్షన్స్‌, ఏఐ స్మార్ట్‌ కాల్‌ అసిస్టెంట్‌, AI స్పామ్ కాల్‌ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది.

vivo T4 Pro 5G Smartphone launched

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వివో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 3x జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 2MP బొకేష్‌ కెమెరాను అమర్చారు.

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ అనేక AI ఇమేజింగ్‌ టూల్స్‌ను సపోర్టు చేస్తుంది. ఇందులో AI Photo Enhance, AI Professional Portrait, AI Erase 3.0, AI Image Expander, AI మేజిక్‌ మూవ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారీ బ్యాటరీ :
ఈ వివో హ్యాండ్‌సెట్‌ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

vivo T4 Pro 5G Smartphone launched

వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.29999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది.

ఈ ఫోన్‌ బ్లేజ్‌ గ్లోల్డ్‌, నిట్రో బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఆగస్టు 29 నుంచి వివో స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్ మరియు భాగస్వామ్య ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ SBI, యాక్సెస్‌ బ్యాంకు, HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.24999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రూ.3000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T4 Pro 5G Smartphone launched with 50MP telephoto lens, 6500mAh battery in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X