రేపే వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. మంచి కెమెరాలు, భారీ బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ డిజైన్..!
వివో నుంచి భారత్ మార్కెట్లోకి రేపు వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ (Vivo T4 Pro 5G Smartphone) లాంచ్ కానుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అల్ట్రా స్లిమ్, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 7.53 mm అల్ట్రా స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 192 గ్రాముల బరువుతో లాంచ్ కానుంది. మరియు అల్ట్రా స్లిమ్ బెజిల్‌తో క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే డిస్‌ప్లే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

వాటర్ రిసిస్టెంట్ :
దీంతోపాటు ఈ వివో స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు. మరియు IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. రీఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్ వివరాలు రేపు విడుదల సమయంలో వెల్లడి కానున్నాయి.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 10,00,000 AnTuTU స్కోర్‌ను కలిగి ఉందని వివో చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎన్ని సంవత్సరాల వరకు అప్‌డేట్స్ పొందనుందో రేపు వెల్లడి కానుంది.
50MP సోనీ 3x పెరిస్కోప్ కెమెరా :
కెమెరా విభాగానికి ఈ స్మార్ట్‌ఫోన్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP సోనీ 3x పెరిస్కోప్ కెమెరా మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ కోం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఇటీవల లాంచ్ అయిన వివో V60 స్మార్ట్‌ఫోన్ తరహాలోనే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.26,999 లేదా రూ.27,999 గా ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గోల్డ్, బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది.
* భారత్ మార్కెట్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వివో V60 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.36,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.38,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.40,999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.45,999 గా ఉంది.
వివో V60 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. . స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ Zeiss భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా (OIS), 50MP సోనీ IMX882 టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్. 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది పైన పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








