రూ.3000 డిస్కౌంట్‌తో మంచి కెమెరాలు, భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Vivo T4 Pro 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో T4 సిరీస్‌లో అనేక మోడల్స్‌ను విడుదల చేసింది. అయితే ఇటీవలే వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే పరంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.29999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.

ఈ ఫోన్‌ను వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, Axis, HDFC బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.3000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తుంది.
వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్ HD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్, ను అమర్చి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 3x జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 2MP బొకేష్ కెమెరాను అమర్చారు. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ AI Erase 3.0, AI Image Expander, AI Magic Move, AI Photo Enhance, AI Professional Portrait వంటి ఫీచర్లు ఉన్నాయి. మరియు ఈ హ్యాండ్‌సెట్ AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్, AI క్యాప్షన్స్, AI స్పామ్ కాల్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 16470 sq mm 10 లేయర్ VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, WiFi 6, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంది. IP68 + IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లేజ్ గ్లోల్డ్, నిట్రో బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








