Home
Mobile

6500mAh బ్యాటరీ, టెలిఫోటో లెన్స్‌, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే Vivo ఫోన్‌ పై రూ.3 వేల డిస్కౌంట్‌!

వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ఆగస్టులో భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. వివో T4 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొంది. ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

ధర, సేల్‌ వివరాలు :
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo T4 Pro 5G Smartphone) వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.29999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉంది.

vivo T4 Pro 5G smartphone sale

రూ.3000 డిస్కౌంట్‌ :
వివో వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా ఫోన్‌ను రూ.24999 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లేజ్‌ గోల్డ్‌, నిట్రో బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే, వాటర్‌ రెసిస్టెంట్‌ :
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ వివో హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని వివో హామీ ఇచ్చింది.

vivo T4 Pro 5G smartphone sale

మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా మరియు 3x జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌, 2MP బొకేష్‌ కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు :
ఈ స్మా్ర్ట్‌ఫోన్‌ ఏఐ మేజిక్‌ మూవ్‌, AI Erase 3.0, AI Image Expander, AI Photo Enhance, AI Professional Portrait వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 16,470 sq mm VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
వివో ఫోన్‌ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T4 Pro 5G smartphone with 6500mAh battery gets Rs3000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X