Home
Mobile

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుంది?

వివో నుంచి ఈ సంవత్సరం T4 సిరీస్ ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇందులో వివో T4x 5G, వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వివో T4 సిరీస్‌ నుంచి మరో హ్యాండ్‌సెట్‌ త్వరలో లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే ఈ వివో T4 అల్ట్రా విడుదల పై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఎప్పుడు విడుదల కానుంది? :
తాజాగా టిప్‌స్టర్‌ యోగేష్ బ్రార్‌ వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4 Ultra) గురించి అనేక వివరాలను వెల్లడించారు. చిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ జున్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. మరియు రూ.30,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

Vivo T4 Ultra Smartphone

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వివరాలు :
టిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే డిస్‌ప్లేకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 లేదా డైమెన్సిటీ 9300e చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌ ఎన్ని సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వివో హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్‌ లెన్స్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టార్‌ తెలిపారు. ముందువైపు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం.

ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుంది. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుత 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు. అయితే విడుదల తేదీతోపాటు ఇతర వివరాలపై వివో ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వివో T4 స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
వివో T4 సిరీస్‌లో భాగంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన వివో T4 స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7300mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8GB/128GB ధర రూ.21,999, 8GB/256GB ధర రూ.23999, 12GB/256GB ధర రూ.25999 గా ఉంది.

వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది. 50MP OIS ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 Ultra Smartphone launch, specifications and features tipped in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X