భలే ఆఫర్.. ఏకంగా సగం ధరకే స్మార్ట్‌ఫోన్..? 100X డిజిటల్ జూమ్ టెలిఫోటో లెన్స్, 1.5K అమోలెడ్ డిస్‌ప్లే సహా
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. అదే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 వ తేదీ నుంచి నిర్వహించనుంది. బ్యాంకు కార్డులపై డీల్స్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ రెండు సంస్థలు క్రమంగా డీల్స్ వివరాలను షేర్ చేస్తున్నాయి.
సగం ధరకే స్మార్ట్‌ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ ఇండియన్ సేల్ లో (Flipkart Great Indian Sale 2026) స్మార్ట్‌ఫోన్‌లపైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు. అయితే వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్‌పై కీలక వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రస్తుతం మిడ్ రేంజ్ ధరలో అందుబాటులో ఉంది. తాజా లీక్స్ ఆధారంగా ఏకంగా సగం ధరకే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.

రూ.18999 ధరకే! :
ఈ డిస్కౌంట్ వివరాలను టిప్‌స్టర్ సంజు చౌదరి లీక్ చేశారు. టిప్‌స్టర్ వివరాల ఆధారంగా ఈ ఫోన్ (Vivo T4 Ultra Smartphone) ప్రస్తుత ప్రారంభ ధర రూ.35999 గా ఉండగా.. త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.18999 ధరకు సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది.
అయితే నేరుగా బ్యాంకు కార్డులపై ఈ డిస్కౌంట్‌ను అందిస్తుందా లేదా ఎక్స్ఛేంజీ ఆఫర్ పై ఈ ధర తగ్గింపును అందిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఈ ఫోన్ ఆకట్టుకొనే జూమ్ సామర్థ్యంతోపాటు అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.35999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.39999 గా ఉంది. ఫినిక్స్ గోల్డ్, మెటియర్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంది.
మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ ఫోన్ 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch 15 పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని వివో చెబుతోంది.
Deal Alert 🚨
— Sanju Choudhary (@saaaanjjjuuu) January 10, 2026
VIVO T4 Ultra will be available at ₹18,499 during Flipkart republic day sale.
Specs:
• 6.67" 1.5k 120Hz QC Amoled
• MTK 9300+
• 50MP IMX921+ 8MP UW + 50MP IMX882 3x Periscope
• 5500mAh + 90W
• IP64
For this price it's an absolute steal. pic.twitter.com/Shc4cHD7fE
100x డిజిటల్ జూమ్ :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్, 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ లెన్స్ ను కలిగి ఉంది.
ఈ టెలిఫోటో లెన్స్ కూడా OIS, EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Note Assist, AI Erase, AI కాల్ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంది.


Click it and Unblock the Notifications








