వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్ సహా..!
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో (Vivo India) ప్రముఖ బ్రాండ్‌గా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటికే అనేక హ్యాండ్‌సెట్స్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా వివో V50, V50e స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. దీంతోపాటు వివో T4x 5G తోపాటు భారీ బ్యాటరీతో వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రేపు భారత్ మార్కెట్లో వివో V50 Elite ఎడిషన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా లీక్ అయ్యాయి.
అయితే భారత్ మార్కెట్లో వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. వివో T4 అల్ట్రా పేరుతో (Vivo T4 Ultra Smartphone) ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. గత సంవత్సరం విడుదల అయిన వివో T3 అల్ట్రా మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఈ T4 అల్ట్రా విడుదల కానుందని సమాచారం. అయితే దీనిపై వివో ఎటువంటి ప్రకటన చేయలేదు.

సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. ఈ ఫోన్‌తోపాటు వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ కూడా అదే సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ V2504 మోడల్ నంబర్ తో కనిపించింది. అయితే మిగిలిన వివరాలు వెల్లడి కాలేదు.
మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్ :
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ సహా అనేక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
* వివో T4 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
గత నెలలో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన వివో T4 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది. ఈ ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తోపాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా వివో హ్యాండ్‌సెట్ 50MP (OIS) కెమెరాతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. భారీ బ్యాటరీ ఫోన్ కావాలని భావిస్తున్న వారికి ఈ వివో హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








