Home
Mobile

వివో T4 అల్ట్రా ధర వివరాలు లీక్.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌, 50MP + 50MP కెమెరాలతోపాటు..!!

వివో T4 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే T4, T4x 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. జూన్‌ 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4 Ultra) విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. చిప్‌సెట్, కెమెరాలు వివరాలను వెల్లడించింది. అయితే తాజాగా ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

ఈ వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుందని వివో ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్‌ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్‌ కానుందో తెలియాల్సి ఉంది.

Vivo T4 ultra Smartphone Price leaked

7.43 mm థిక్‌నెస్‌ :
ఈ హ్యాండ్‌సెట్ 7.43 mm థిక్‌నెస్‌తో అందుబాటులోకి రానుందని వివో తెలిపింది. మరియు 192 గ్రాముల బరువుంటుంది. మరియు 5000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ వైట్‌ మరియు బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. మిగిలిన కలర్‌ వేరియంట్స్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

కెమెరా వివరాలు :
కెమెరా వివరాలను కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX921, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ మరియు OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX882 టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి రానుంది.

బ్యాటరీ వివరాలు :
అయితే ఈ ఫోన్‌ బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే ప్రస్తుతం లీక్‌ అయిన వివరాల ఆధారంగా వివో T4 అల్ట్రా మోడల్‌ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే వివో T4 సిరీస్‌లో వచ్చిన వివో T4 మోడల్‌ ఏకంగా 7300mAh బ్యాటరీ, T4x 5G ఫోన్ 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలను లీక్‌ చేశారు. మిడ్‌ రేంజ్‌ ధరలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ వివరాల ఆధారంగా అల్ట్రా మోడల్‌ సుమారు రూ.35000 గా ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో భారీ బ్యాటరీ ఫోన్‌ వివో T4.. 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90W ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.

వివో T4 స్మార్ట్‌ఫోన్‌ 50MP (OIS) కెమెరా, 2MP కెమెరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది.

FAQs
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది?

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ జూన్ 11 వ తేదీన విడుదల కానుంది.

వివో T4 సిరీస్‌లో ఇప్పటి వరకు ఏయే ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి?

ఈ సిరీస్‌లో వివో T4, వివో T4x 5G ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి.

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ఎంత ధరలో విడుదలయ్యే అవకాశం ఉంది?

టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ వివరాల ఆధారంగా ఈ ఫోన్ రూ.35 వేల ధర రేంజ్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

GizBot Technology
Best Mobiles in India

English summary
Vivo T4 ultra Smartphone Price leaked ahead of launch on june 11, here are the confirmed specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X