Home
Mobile

ఇవాళ్టి నుంచే 50MP +8MP + 50MP కెమెరాలు, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే వివో ఫోన్‌ సేల్‌.. రూ.3000 డిస్కౌంట్‌..!

Vivo T4 Ultra Smartphone Sale : వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ గత వారం భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ ను వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ధర వివరాలు :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

Vivo T4 ultra smartphone sale

రూ.3000 డిస్కౌంట్ :
ఈ సేల్‌లో భాగంగా SBI, HDFC, యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. మరియు పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజీ చేయడం ద్వారా రూ.5000 బోనస్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ ఫినిక్స్‌ గోల్డ్‌, మెటియర్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ వివో ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు తోపాటు SGS Low Blue లైట్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్‌, 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చు.

Vivo T4 ultra smartphone sale

ఆకట్టుకొనే కెమెరా ఫీచర్లు :
ఈ ఫోన్‌ 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ మరియు 3x ఆప్టికల్‌ జూమ్‌, 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్‌, 100x డిజిటల్‌ జూమ్‌ తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాను (OIS, EIS) కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.

ఈ ఫోన్‌ సర్కిల్ టూ సెర్చ్‌, AI Erase, AI నోట్‌ అసిస్ట్‌, AI కాల్‌ ట్రాన్స్‌లేషన్‌, AI ట్రాన్స్‌స్క్రిప్ట్‌ అసిస్ట్‌ AI ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Vivo T4 ultra smartphone sale to start from today in india, rs3000 discount on these bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X