ఫ్లాగ్‌షిప్ జూమింగ్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్‌తో Vivo 5G ఫోన్.. విడుదల తేదీ వెల్లడి..!
వివో ఇండియా నుంచి కీలక ప్రకటన వెలువడింది. వివో T4 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో వివో T4, T4x 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వివో T4 అల్ట్రా మోడల్ (Vivo T4 Ultra Smartphone) విడుదల కానుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ సహా ఇతర వివరాలు విడుదల అయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది? :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ జూన్ 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది. ఈ ఫోన్ సుమారుగా రూ.35 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ AnTuTu స్కోర్ 2 మిలియన్‌లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5x ర్యామ్ మరియు 256GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుందని సమాచారం. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే వివరాలు :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K కర్వడ్ OLED డిస్‌ప్లే ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ అల్ట్రా వేరియంట్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తోపాటు 3x ఆప్టికల్ జూమ్ మరియు OIS సపోర్టుతో 50MP సోనీ X882 పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 100X జూమింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా యూజర్లు మెరుగైన అనుభూతిని పొందుతారని చెబుతోంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌ను కూడా కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ ఫోన్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh లేదా 7000mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందో వెల్లడి కాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వివో T4 స్మార్ట్‌ఫోన్ :
ఇప్పటికే అందుబాటులో ఉన్న వివో T4 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, రెండు రోజులపాటు ఉపయోగించుకోవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications