Home
Mobile

50MP + 8MP + 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ, క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో వివో T4 Ultra 5G ఫోన్ విడుదల!

Vivo T4 Ultra Smartphone : వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు కెమెరా విభాగం పరంగా 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. రెండు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ వివో ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్‌, 512GB UFS 3.1 సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch 15 ను కలిగి ఉంది.

Vivo T4 Ultra smartphone launch news in telugu

ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5K క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు SGS Low Blue లైట్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

100x డిజిటల్‌ జూమ్‌తో :
కెమెరా వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్‌, OIS సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు f/2.55 అపేచర్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌, 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్‌, 100x డిజిటల్‌ జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

Vivo T4 Ultra smartphone launch news in telugu

ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో :
ఈ టెలిఫోటో కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ AI కాల్‌ ట్రాన్స్‌లేషన్‌, AI ట్రాన్స్‌స్క్రిప్ట్‌ అసిస్ట్‌, AI Erase, AI నోట్‌ అసిస్ట్‌, సర్కిల్ టూ సెర్చ్‌ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లున్నాయి. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌ ఇన్‌డిస్‌ప్లే ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ అమర్చారు. ఈ ఫోన్‌ 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.4, GPS, OTG, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Take a Poll

వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41999 గా ఉంది.

HDFC, SBI card, యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ సేల్‌ (Vivo T4 Ultra Smartphone Sale) జూన్‌ 18 నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ఫినిక్స్‌ గోల్డ్‌, మెటియర్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Vivo T4 Ultra smartphone with upto 100x digital zoom 50MP telephoto Camera launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X