50MP కెమెరా, 5700mAh బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లేతో Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!
Vivo T4R 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇవాళ వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 7.39mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు IP68, IP69 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో కొత్త ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల ఫుల్ HD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే SGS సర్టిఫికేషన్‌తో కలిగి ఉంది. మరియు HDR10+ సపోర్టును కలిగి ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్, AI డాక్యుమెంట్, AI నోట్ అసిస్ట్, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌స్క్రిప్ట్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. వెనుక, ముందు కెమెరాలతో 4K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
భద్రత కోసం వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ బ్లూ, సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధఱ రూ.21499 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23499 గా ఉంది. ఈ వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 5 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.2000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయాన్ని పొందవచ్చు. వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








