Home
Mobile

క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, IP68 + IP69 రేటింగ్‌తో వివో T4R స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళే విడుదల!

Vivo T4R 5G Smartphone Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇవాళ భారత్‌ మార్కెట్‌లోకి వివో T4R స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. వివో T4 సిరీస్‌లో ఇప్పటికే వివో T4, వివో T4x, వివో T4 అల్ట్రా, వివో T4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వివో T4R స్మార్ట్‌ఫోన్ కోసం ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి.

క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే కలిగిన తొలి సన్నని ఫోన్‌! :
వివో T4R స్మార్ట్‌ఫోన్‌ వివో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 0.739 cm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లే కలిగిన తొలి సన్నని ఫోన్‌ ఇదేనని వివో చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 120H రీఫ్రెష్‌ రేట్‌, HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది. Low బ్లూ లైట్‌ SGS సర్టిఫికేషన్‌ను కూడా ఉంటుంది.

Vivo T4R Smartphone launch today

చిప్‌సెట్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AnTuTu స్కోర్ 750K గా ఉందని వివో తెలిపింది. భారత్ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్ రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ కెమెరా, 2MP బొకేష్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ రెండు వైపుల కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.

బెస్ట్‌ వాటర్‌ ప్రూఫ్‌ రేటింగ్ :
ఈ వివో T4R స్మార్ట్‌ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
వివో T4 సిరీస్‌ నుంచి ఇటీవల వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4R Smartphone launching today in india here are the confirmed specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X