Home
Mobile

వివో నుంచి సన్నని డిజైన్‌, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేతో 5G ఫోన్‌.. ధర రేంజ్‌, స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్‌..!

Vivo T4R 5G Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ వివో నుంచి త్వరలో వివో T4R 5G ఫోన్‌ విడుదల కానుంది. ఇప్పటికే వివో T4 సిరీస్‌ నుంచి వివో T4 5G, T4x 5G, T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ నెల 24 వ తేదీన విడుదల కానున్న ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌కు ఈ T4R 5G స్మార్ట్‌ఫోన్‌ రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఉంటుందని తెలుస్తోంది.

ధర వివరాలు లీక్‌ :
భారత్‌ మార్కెట్‌లో ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయిన కొన్ని రోజుల తర్వాతనే ఈ వివో T4R 5G మోడల్ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ వివో ఫోన్ రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

vivo T4R 5G Smartphone

వివో ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు 91మొబైల్స్ హిందీ ద్వారా లీక్‌ అయ్యాయి. ఈ వివరాల ఆధారంగా వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ 7.39mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు 120Hz ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

మీడియోటెక్ చిప్‌సెట్ :
ఈ వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తుందని సమాచారం.

50MP కెమెరా! :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వివో T4 లైట్ 5G :
ఇటీవల వివో T4 సిరీస్‌ నుంచి వివో T4 లైట్ 5G అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది.

వివో T4 లైట్‌ 5G ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌, మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo T4R 5G Smartphone price range and specifications leaked expected launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X