Home
Mobile

క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగిన తొలి సన్నని ఫోన్ ఇదే..! ఇవాళ్టి నుంచే సేల్‌.. రూ.2000 డిస్కౌంట్‌!

Vivo T4R 5G smartphone Sale : వివో నుంచి గత వారం చివర్లో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌ లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 7.39mm థిక్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుందని వివో తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.

వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర భాగస్వామ్య రిటైల్‌ స్టోర్‌ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఆర్కిటిక్ వైట్‌, ట్విలైట్‌ బ్లూ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

vivo T4r 5g

ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.2000 ఎక్స్ఛేంజీ బోనస్‌, 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు.

3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ :
వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్ :
ఈ వివో ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది.

50MP కెమెరా సహా అనేక AI ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ సర్కిల్‌ టూ సెర్చ్‌, AI Document AI Note Assist, AI Screen Translation, AI Transcript వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంది.

44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4R 5G smartphone sale to start from sale today via flipkart here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X