కర్వడ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్!
వివో నుంచి ఇవాళ భారత్ మార్కెట్‌లోకి వివ V70 సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్ లో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ ఫోన్‌లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన వివో T4R స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP కెమెరాను కలిగి ఉంది. క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
డిస్కౌంట్ ఆఫర్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4R 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందుతుంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపైనా డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఆర్కిటిక్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్, SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.
క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్ లెన్స్‌లు ఉన్నాయి. ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ వివో ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్ టూ సెర్చ్, AI Note Assist, AI Document, AI Transcript, AI Screen Translation వంటి ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








