Home
Mobile

తక్కువ బ‌డ్జెట్ ధరలో మరో ఫోన్ తీసుకొస్తున్న vivo..క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, రేటింగ్‌తో సహా ఆకట్టుకొనే ఫీచర్లు

Vivo T4R Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. వివో T4 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వివో T4 సిరీస్‌లో భాగంగా వివో T4, వివో T4x 5G, వివో T4 లైట్‌ 5G, వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఈ సిరీస్‌ నుంచి వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది.

ఎప్పుడు విడుదల కానుంది ?
భారత్ మార్కెట్‌లో వివో T4R 5G స్మార్ట్‌ఫోన్‌ జులై 31 మధ్యాహ్నం 12PM గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం వివో ఇండియా ఇ-స్టో్ర్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

Vivo T4R Smartphone launch date and key specifications  features revealed in india

7.3mm థిక్‌నెస్‌ :
ఈ వివో ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ స్లిమ్‌, యూనిఫామ్‌ బెజెల్స్‌, పంచ్‌ హోల్‌ డిజైన్‌తో కూడిన క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7.3mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ గా ఉంటుంది.

50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు 50MP సోనీ IMX882 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. అయితే మరో కెమెరా సహా సెల్ఫీ కెమెరా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ ఫోన్‌ ముందు, వెనుక కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్‌ చేయవచ్చని చెబుతోంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలిపింది. భారత్‌ మార్కెట్‌లో వివో T4R స్మార్ట్‌ఫోన్ రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ధరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

* వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
వివో T4 సిరీస్‌ను ఇటీవల వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది.

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

వివో T4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4R Smartphone launch date and key specifications, features revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X