మీడియాటెక్ చిప్‌సెట్, 50MP కెమెరా, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేతో వివో ఫోన్.. తాజాగా ధర వివరాలు వెల్లడి..!
వివో నుంచి భారత్ మార్కెట్‌లో వివో T4R స్మార్ట్‌ఫోన్ (Vivo T4R Smartphone) జులై 31 న విడుదల కానుంది. ఈ ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ కెమెరా స్పెసిఫికేషన్‌లతోపాటు ధర రేంజ్ వివరాలను వివో వెల్లడించింది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 50MP సోనీ IMX882, 2MP బొకేష్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చని వివో తెలిపింది.

ఇటీవల విడుదల అయిన వివరాల ఆధారంగా వివో T4R స్మార్ట్‌ఫోన్ ఈ వివో T4R ఫోన్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేతో స్లిమ్ డిజైన్ ఫోన్ ఇదేనని వివో చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ హ్యాండ్‌సెట్ రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ AnTuTu స్కోర్ 750K గా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వరకు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బ్యాటరీ అంచనా వివరాలు :
ఈ ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు వెల్లడి కాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న అంచనా వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వివో T4 సిరీస్‌లో ప్రస్తుతం వివో T4, వివో T4x, వివో T4 లైట్, వివో T4 అల్ట్రా ఫోన్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ నుంచి ఐదో ఫోన్‌గా T4R విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ జులై 31 మధ్యాహ్నం 12PM గంటలకు విడుదల కానుంది. వివో ఇండియా ఇ-స్టో్ర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.
* వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
వివో T4 సిరీస్ నుంచి ఇటీవల వివో T4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15 పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది.
వివో హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది.


Click it and Unblock the Notifications








