రూ.12 వేల ధరలో 6400mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫుల్ HD+ డిస్‌ప్లేతో Vivo 5G స్మార్ట్‌ఫోన్..!
వివో నుంచి ఈ నెలలోనే మిడ్ రేంజ్ ధరలో వివో V50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ నెల 25 నుంచి సేల్ కూడా ప్రారంభం అయింది. అయితే మరో హ్యాండ్‌సెట్ త్వరలో విడుదల కానుంది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. వివో T4x 5G పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ విడుదల తేదీని వివో అధికారికంగా వెల్లడించింది. తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్నా.. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్‌లను ఈ ఫోన్ కలిగి ఉండనుంది.
ఎప్పుడు విడుదల కానుంది? :
వివో అధికారిక ప్రకటన ప్రకారం వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4x 5G Smartphone) మార్చి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో T3x ఫోన్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్స్‌తో ఈ కొత్త హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది.

ప్రస్తుతం అందుబాుటలో ఉన్న వివరాల ఆధారంగా వివో T4x 5G హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది.
డైనమిక్ లైట్ ఫీచర్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు రింగ్ ఆకారంలో LED ఫ్లాష్ లైట్‌ను అమర్చి ఉంటుంది. దీన్ని డైనమిక్ లైట్ ఫీచర్‌గా చెబుతున్నారు. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీ :
ఈ వివో 5G ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
అయితే స్మార్ట్‌ఫోన్ వివో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి మైక్రోసైట్ లైవ్‌లో ఉంది. దీని ఆధారంగా ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా ఈ వివో T4x 5G ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12xxx గా ఉంది. అంటే రూ.12999 ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివో కొత్త బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మిగిలిన వేరియంట్‌లు, ధరల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్ల వివరాలతోపాటు ఈ సేల్ తేదీ వెల్లడి కాలేదు. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
* ఇటీవలే వివో నుంచి v50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.34999 గా ఉంది. ట్రిపుల్ 50MP కెమెరాలను కలిగి ఉంది. 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టూ సెర్చ్, ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్ వంటి AI ఫీచర్‌లున్నాయి. 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








