6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌తో Vivo 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్..!
Vivo T4x 5G Smartphone : వివో నుంచి T4 సిరీస్ లో భాగంగా వివో T4, వివో T4x 5G, వివో T4 లైట్ 5G, వివో T4 అల్ట్రా, వివో T4R 5G స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటోంది.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
ఫ్లిప్‌కార్ట్ సేల్ లో ( Flipkart Freedom Sale 2025 ) భాగంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.750 డిస్కౌంట్ కు కొనుగోలు చేయవచ్చు.

సేల్ లో భాగంగా ధర వివరాలు :
బ్యాంకు డిస్కౌంట్‌లతో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,249 గా ఉంది. మిగిలిన రెండు వేరియంట్స్ ధరలు రూ.14,249, రూ.15,249 గా ఉన్నాయి. ఈ ఫోన్ మెరీన్ బ్లూ, ప్రాంటో పర్పుల్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్ :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

6500mAh బ్యాటరీ, 6.72 అంగుళాల డిస్‌ప్లే :
ఈ వివో హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.72 అంగుళాల FHD+ IPS LCD ( 2408 x 1080 పిక్సల్స్ ) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP కెమెరా, డైనమిక్ లైట్ :
వివో T4x 5G హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 2MP బొకేష్ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు డైనమిక్ లైట్ రింగ్ ను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడం సేల్ 2025 ఆగస్టు 1 నుంచి ప్రారంభం అయింది. సేల్‌లో ప్రత్యేక ఆఫర్లతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ లను పొందవచ్చు. ICICI బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








