Home
Mobile

ఇవాళ్టి నుంచి 6500mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌ ప్రారంభం.. ఇలా చేస్తే రూ.1000 డిస్కౌంట్‌.!

వివో నుంచి ఇటీవల భారత్‌ మార్కెట్‌లో వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతోపాటు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ బడ్జెట్‌ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ వివో ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి (Vivo T4x 5G Smartphone Sale in india) ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ ధర :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

Vivo T4x 5G Smartphone

ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. తొలిసేల్‌లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్, డెబిట్‌ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతోనూ రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ప్రారంభ ధర రూ.12999 గా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ మెరిన్‌ బ్లూ, ప్రోంటో పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది.

వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
వివో T4x 5G హ్యాండ్‌సెట్ (Vivo T4x 5G) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల (2408*1080 పిక్సల్స్‌) FHD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.ఈ డిస్‌ప్లే 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

Vivo T4x 5G Smartphone

3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందనుంది. మరియు ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చారు. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP బొకేష్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు డైనమిక్‌ లైట్‌ రింగ్‌ను ఏర్పాటు చేశారు. మరియు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ రూ.13000 ధరలో అందుబాటులోకి వచ్చింది. అయినా భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఫలితంగా ఎక్కువ సమయం ఫోన్‌ వినియోగించే యూజర్లు ఎక్కువ సార్లు ఛార్జింగ్ చేసే అవసరం లేకుండా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 44W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ పరంగా వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఇ-కంపాస్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, గైరోస్కో్ప్‌, IR బ్లాస్టర్‌ వంటి సెన్సార్‌లను అమర్చారు. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లు, 4D గేమ్‌ వైబ్రేషన్ ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4x 5G Smartphone sale to start from today via flipkart in india and get rs1000 with bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X