6500mAh బ్యాటరీ, 50MP కెమెరా వివో 5G ఫోన్‌పై డిస్కౌంట్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు..!
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ (Vivo T4x 5G Smartphone) ఈ సంవత్సరం మార్చి నెలలో విడుదల అయింది. ఈ ఫోన్ 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. డిజైన్ పరంగానూ ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ వివో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ లో అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13499 గా ఉంది.

వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2408 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1050 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మెరిన్ బ్లూ, ప్రోంటో పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని వివో తెలిపింది.
వివో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 2MP బొకేష్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు వెనుక వైపు డైనమిక్ లైట్ రింగ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చి ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలిరోమీటర్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కో్ప్ వంటి సెన్సార్‌లున్నాయి.
* జూన్ నెలలో వివో T4 సిరీస్ నుంచి వివో T4 అల్ట్రా ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మెరుగైన కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇందులో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 100X జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు LED ఫ్లాష్ రింగ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ అల్ట్రా మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్‌సెట్, 90W ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వివో ఇండియా స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications








