Home
Mobile

మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, 6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా 5G ఫోన్‌పై డిస్కౌంట్!

Vivo T4x 5G Smartphone : వివో సంస్థ భారత్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ ను లాంచ్‌ చేసింది. అయితే వివో T4 సిరీస్‌ లో బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ హ్యాండ్‌సెట్‌లను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌ లో భాగంగా విడుదల అయిన వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

భారత్‌ మార్కెట్‌ లో ఈ ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.16,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Vivo T4x 5G Smartphone with 6500mAh Battery gets discount price on flipkart  specs and features

రూ.13499 ధరకే 5G స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ ను రూ.13,499, రూ.14,499, రూ.16,499 ధరలకే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ఈ ఫోన్‌ గ్లేషియల్‌ టీల్, మెరీన్ బ్లూ, ప్రాంటో పర్పుల్‌ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తోంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుంది.

Vivo T4x 5G Smartphone with 6500mAh Battery gets discount price on flipkart  specs and features

FHD+ డిస్‌ప్లే, 6500mAh భారీ బ్యాటరీ :
ఈ వివో హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 44W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.

50MP ప్రైమరీ కెమెరా, డైనమిక్‌ లైట్‌ రింగ్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP బొకేష్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు డైనమిక్‌ లైట్ రింగ్ కూడా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP లెన్స్‌ ను అమర్చారు. ఈ ఫోన్ వెనుక కెమెరాలు సూపర్‌ నైట్‌ మోడ్‌, 4k వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌ :
ఈ ఫోన్ AI Photo Enhance, AI Erase వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4x 5G Smartphone with 6500mAh Battery gets discount price on flipkart, specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X