Home
Mobile

Vivo T4x 5G Vs Realme P3 5G వివో, రియల్‌మి 5G ఫోన్‌లలో ఏది బెస్ట్‌.. బ్యాటరీనా.. డిస్‌ప్లేనా?

భారత్‌ మార్కెట్‌ లో రూ.15,000 ధర సెగ్మెంట్‌ లో 5G స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. ఈ ధరలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన హ్యాండ్‌సెట్స్‌ మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లలను కలిగి ఉంటున్నాయి. వివో Tx4 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.13999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే గత వారం లాంచ్‌ అయిన రియల్‌మి P3 5G ఫోన్‌ 6000mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

వివో Tx4 5G స్మార్ట్‌ఫోన్, రియల్‌మి P3 5G ఫోన్‌ రెండు (Vivo T4x 5G Vs Realme P3 5G) కూడా మెరుగైన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. అయితే బ్యాటరీ, డిస్‌ప్లే సహా మరిన్ని విభాగాల్లో వ్యత్యాసాలున్నాయి. ఈ రెండు ఫోన్‌లలో ఏ హ్యాండ్‌సెట్‌ ను కొనుగోలు చేయాలో చాలా మంది తెగ ఆలోచన చేస్తుంటారు. అలాంటి వారికి కోసం ఈ ప్రత్యేక కథనం.

vivo t4x 5g

* వివో T4x 5G స్పెసిఫికేషన్‌లు :
వివో T4x 5G (Vivo T4x 5G Smartphone Specs) హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల (2408*1080 పిక్సల్స్‌) FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 44W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

చిప్‌సెట్ :
ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందనుంది.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చారు. f/1.8 అపేచర్‌ తో 50MP మెయిన్‌ కెమెరా, f/2.4 అపేచర్‌ తో 2MP బొకేష్‌ కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు డైనమిక్‌ లైట్‌ రింగ్‌ ను అమర్చారు. ఈ కెమెరా యూనిట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్‌, గైరోస్కో్ప్‌, యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఇ-కంపాస్‌, IR బ్లాస్టర్‌ సెన్సార్‌లను అమర్చారు. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

ధర వివరాలు :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

vivo t4x 5g

* రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme Pe 5G Smartphone) గత వారం భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఈ ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే ProXDR సపోర్టు చేస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

కెమెరా, బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

Take a Poll

వాటర్‌ ప్రూఫ్‌ :
ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 1.5 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాల వరకు డ్యామేజీ కాకుండా ఉంటుంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది.

వివో ఫోన్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6500mAh బ్యాటరీతో లాంచ్‌ అయింది. మరియు మీడియాటెక్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అదే రియల్‌మి ఫోన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 15 OS నే కలిగి ఉన్నాయి.

vivo t4x 5g

ఈ రెండు ఫోన్‌ల ధరలు :
ధరల విషయానికి వస్తే వివో T4x 5G ఫోన్ ప్రారంభ ధర రూ.13999 గా ఉంది. అదే రియల్‌మి P3 5G ఫోన్ రూ.16999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో రూ.15 వేల ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెండు ఫోన్‌ల ధరల మధ్య కొంచెం వ్యత్యాసం ఉంటుంది.

ఏ ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు :
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌, రియల్‌మి P3 5G ఫోన్‌లు వాటి ధరలో బెస్ట్‌ ఫోన్లుగా ఉన్నాయి. భారీ బ్యాటరీ కలిగిన ఫోన్‌ కావాలంటే వివో వైపు మొగ్గుచూపవచ్చు. అదే అమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు మెరుగైన వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌ కావాలంటే రియల్‌మి హ్యాండ్‌సెట్‌ ను కొనుగోలు చేయవచ్చు. అయితే రెండు ఫోన్‌లు కూడా మెరుగైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4x 5G Vs Realme P3 5G which is the best smartphone in Rs15000 price sigment in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X