Home
Mobile

బడ్జెట్‌ రేంజ్‌ ధరలో 6500mAh బ్యాటరీ, 50MP AI కెమెరాతో Vivo స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి ఇటీవల V50 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. డిజైన్ సహా కెమెరా ఫీచర్‌ల పరంగా ఈ ఫోన్ ఆకట్టుకుంది. ఈ ఫోన్‌ సేల్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే బడ్జెట్ రేంజ్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు వివో ప్రయత్నం చేస్తోంది. అయితే రూ.15,000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారీ బ్యాటరీ సహా మెరుగైన ఫీచర్‌లను అందిస్తుందని తెలుస్తోంది.

వివో T4X స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
వివో T4X స్మార్ట్‌ఫోన్‌ (Vivo T4X Smartphone) గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. ఇప్పటికే లీక్‌ అయిన డిజైన్‌ కూడా ఆకట్టుకుంటోంది. దీంతోపాటు ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ వివో బడ్జెట్‌ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

Vivo T4X Smartphone camera details

50MP ప్రైమరీ కెమెరా! :
వివో T4X స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాలను మైస్మార్ట్‌ప్రైస్‌ వెల్లడించింది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ 50MP AI ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ కెమెరాలు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటాయి. AI Photo Enhance, AI ఎరేజ్‌, AI డాక్యూమెంట్‌ మోడ్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

డైనమిక్‌ లైట్‌ ఫీచర్‌ :
అయితే ఈ ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెకండ్‌ కెమెరా వివరాలు సహా సెల్ఫీ కెమెరా స్పెసిఫికేషన్‌లు తెలియాల్సి ఉంది. అయితే తక్కువ ధరలో అందుబాటులోకి రానున్నా... మెరుగైన కెమెరా ఫీచర్‌లనే కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ డైనమిక్‌ లైట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు IR బ్లాస్టర్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ గురించి గతంలో వివో కొన్ని వివరాలను అధికారికంగా ప్రకటన చేసింది. ఈ ఫోన్‌ 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని వెల్లడించింది. ఫలితంగా అధిక సమయంపాటు వినియోగించే యూజర్లకు ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ వివో T4x ఫోన్‌ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చే అవకాశం ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 4GB, 6GB, 8GB ర్యామ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే OS వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?
వివో T4X హ్యాండ్‌సెట్‌ అంచనా ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. 4GB ర్యామ్ + 128GB ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉండే అవకాశం ఉంది.

వివో ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల గురించి వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం బ్యాటరీ వివరాలను మాత్రమే వెల్లడించింది. ఇతర వివరాలపై స్పందించలేదు. మార్చి నెలలో ఈ ఫోన్‌ విడుదల కానుంది. లాంచ్‌ ఈవెంట్‌ తేదీ దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత్‌ మార్కెట్‌లో రూ.15000 ధర సెగ్మెంట్‌లో 6500mAh బ్యాటరీతో యూజర్‌లను ఆకట్టుకొనేందుకు వివో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ధరలో వివో అనేక స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంది. అయితే డిస్‌ప్లే వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4X Smartphone camera details leaked here are the expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X