Home
Mobile

ఏకంగా 6500mAh బ్యాటరీతో వివో T సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఎప్పుడు విడుదల కానుంది..?

వివో నుంచి భారత్ మార్కెట్‌ లోకి ఫిబ్రవరి 17 వ తేదీన వివో V50 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే వివో నుంచి మరో హ్యాండ్‌సెట్ కూడా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. T సిరీస్‌ హ్యాండ్‌సెట్‌ ను (Vivo India) విడుదల చేయనున్నారు. అయితే ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ వివో స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

వివో T4x పేరుతో (Vivo T4x Smartphone) ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. భారత్‌ లో మార్చి నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మై స్మార్ట్‌ప్రైస్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.

Vivo T4x Smartphone

డైనమిక్‌ లైట్‌ ఫీచర్‌ :
వివో T4x స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించిన అంచనా స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి. వివో T3x స్మార్ట్‌ఫోన్ కంటే మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ డైనమిక్‌ లైట్‌ ఫీచర్‌ తో విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ తరహా ఫీచర్ వివో Y58 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ డైనమిక్‌ ఫీచర్‌ ద్వారా నోటిఫికేషన్‌ ల వివరాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంది. కస్టమైజ్డ్‌ లైటింగ్‌ ఎఫెక్ట్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా సులభంగా అనేక రకాల నోటిఫిషన్‌ల గురించి తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

రెండు కలర్‌ వేరియంట్స్‌ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా భారీ బ్యాటరీతో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ప్రాసెసర్‌, కెమెరా, డిస్‌ప్లేలు ఎలా ఉంటాయో ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రోంటో పర్పుల్‌, మెరైన్‌ బ్లూ వంటి రెండు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుందని తెలుస్తోంది.

వివో T3x స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివో T3x 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.13,499 గా ఉంది.

వివో T3x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల (1080*2408 పిక్సల్స్‌) FHD LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మరియు 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫ్రింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను అమర్చారు. వివో T3x స్మార్ట్‌ఫోన్‌ క్రిమ్షన్‌ బ్లిస్‌, సఫైర్‌ బ్లూ, సెలస్టియల్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4x Smartphone with 6500mAh large battery may launch in march in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X