వివో నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. 7200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 OS సహా కీలక వివరాలు లీక్..!
వివో నుంచి ఇటీవల V70 సిరీస్ లాంచ్ అయింది. ఇందులో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. త్వరలో వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వివో T5 సిరీస్‌లో భాగంగా T5x 5G త్వరలో (Vivo T5x 5G Smartphone) లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి.
కీలక వివరాలు లీక్! :
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X హ్యాండిల్ ద్వారా వివో V5x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలను లీక్ చేశారు. ఈ వివో హ్యాండ్‌సెట్ ఐకూ Z11x మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలిపారు. ఈ ఐకూ ఫోన్ భారత్‌లో మార్చి 12 వ తేదీన విడుదల కానుంది.

మీడియాటెక్ చిప్! :
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌తో పనిచేస్తుందని తెలిపారు. 1 మిలియన్ AnTuTu స్కోర్‌ను పొందినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లోనే ఫాస్టెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందని సంస్థ చెబుతోంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6.0 పైన పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని టిప్‌స్టర్ తెలిపారు. దీంతోపాటు AI ప్రొడక్టివిటీ సూట్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.
More Vivo T5X details
— Yogesh Brar (@heyitsyogesh) March 6, 2026
- Dimensity 7400 Turbo
- 50MP Sony IMX852
- 7200mAh battery
- 44W fast charging
- 5 year battery health
- 4K video recording
- Origin OS 6
- AI productivity suite
- IP68 , IP69+ rating
Cyber Green & Star White colors
Mid March launch, price under Rs 20k
7200mAh బ్యాటరీ! :
ఈ హ్యాండ్‌సెట్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7200mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుందని చెబుతున్నారు. గరిష్ఠంగా 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని తెలిపారు. ఐకూ మోడల్ కూడా ఇదే బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
50MP సోనీ కెమెరా! :
కెమెరా విభాగం పరంగా వివో హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ముందు, వెనుక వైపు ఉన్న కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయని తెలిపారు.
భారత్ మార్కెట్‌లో వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన రిటైల్ స్టోర్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు
ఈ హ్యాండ్‌సెట్ స్టార్ వైట్, సైబర్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని టిప్‌స్టర్ తెలిపారు. మార్చి నెల మధ్యలో ఈ ఫోన్ విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ వివరాలపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








